Friday, March 13, 2026
HomeMovie Newsరూ.140 కోట్ల నష్టం రికవరీ కాలేదు.. అయినా వెనకడుగు వేయను

రూ.140 కోట్ల నష్టం రికవరీ కాలేదు.. అయినా వెనకడుగు వేయను

mirai-producer-tg-viswaprasad-on-losses

టాలీవుడ్‌లో ఇటీవల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మిరాయ్ మూవీతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పెద్ద విజయాన్ని అందుకున్నారు. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి ఆయనకు ఊరట కలిగించింది.

అయితే, వరుస ఫ్లాపుల కారణంగా తమ సంస్థకు రూ.140 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని విశ్వప్రసాద్ ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యంగా 2021-2023 మధ్య నాన్ థియేట్రికల్ హక్కులకు ఉన్న డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోవడంతో పరిస్థితి కఠినమైందని చెప్పారు.

ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్, స్వాగ్, విశ్వం వంటి సినిమాలు థియేట్రికల్‌గా బాగానే నడిచినా, ఓటీటీ హక్కుల డిమాండ్ తగ్గడంతో నష్టాలు పెరిగాయని ఆయన వివరించారు.

2024లో రవితేజ ధమాకా మాత్రమే లాభాలు తెచ్చిందని పేర్కొన్నారు. ఓటీటీల క్యాలెండర్ సమస్యలు, విడుదల ఆలస్యాలు కూడా నష్టాలకు కారణమని అన్నారు.

అయినా సినిమాలపై ఉన్న తన ప్రేమ తగ్గదని స్పష్టంగా చెప్పారు. కొత్త కథలు ఎంచుకుంటూ, ప్రయోగాత్మక సినిమాలు నిర్మిస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరిశ్రమలో నిజాయితీగా మాట్లాడే నిర్మాతల్లో ఆయన ఒకరని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular