
టాలీవుడ్ యువ నటుడు తనూజ్ చంద్రమౌళి లిటిల్ హార్ట్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. చిన్న సినిమా అయినా, పెద్ద విజయాన్ని అందుకోవడం ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది.
సక్సెస్ మీట్‌లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిథిగా హాజరై మౌళికి మోటివేషన్ ఇచ్చేలా మాట్లాడారు. “ఎవరేం చెప్పినా మనం ఎవరిలా ఉండక్కర్లేదు. నీ నాన్న, నీ అమ్మని చూపించడం కంటే పెద్ద సక్సెస్ లేదు” అంటూ ఆయన చెప్పిన మాటలకు హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగించాయి.
విజయ్ మాట్లాడుతూ, “నీ పేరెంట్స్ నీకు పెట్టిన పేరు మౌళి. మరొకరిలా ఉండాలని అనుకోవద్దు. నువ్వే నీలా ఉంటే చాలు” అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లిటిల్ హార్ట్స్ టీమ్‌తో తనకు ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, వాళ్లు అందరూ కలిసి చేసిన ఈ సినిమా హిట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
“ఈ సినిమాతో కేవలం హీరో జీవితమే కాదు, మొత్తం టీమ్ జీవితాలు మారిపోతాయి. పక్కన ఉన్న ఇంకో పది ఇరవై మంది జీవితాలు కూడా మారిపోతాయి” అని విజయ్ అన్నారు.
ప్రస్తుతం విజయ్ కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తనూజ్ మౌళి తదుపరి సినిమాకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
