
రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న RC17 ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశమే హద్దు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో, చరణ్ త్వరలోనే సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నారు.
సుకుమార్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేస్తున్నారు. టెక్నికల్ టీమ్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు ఎప్పటిలాగే సపోర్ట్ చేసే బలమైన యూనిట్ రెడీగా ఉంది. ఇప్పుడు హాట్ టాపిక్ హీరోయిన్ ఎంపిక.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రితిసనన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్. సుకుమార్ రాసిన హీరోయిన్ క్యారెక్టర్ కు ఆమెనే పర్‌ఫెక్ట్ గా సరిపోతుందని భావిస్తున్నారట. ప్రత్యేక ఫోటోషూట్ లేకుండా నేరుగా ఫైనల్ చేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది నిజమైతే, క్రితిసనన్ కు టాలీవుడ్ లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. గతంలో మహేష్ బాబు వన్ సినిమాలో నటించిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం హిందీలో వరుస బిగ్ ప్రాజెక్టుల్లో నటిస్తున్న క్రితిసనన్, సుకుమార్ ఆఫర్ ను అంగీకరిస్తే, రామ్ చరణ్ సరసన స్క్రీన్ షేర్ చేసే అవకాశం లభిస్తుంది.
ఇక పెద్ది రిలీజ్ తర్వాత ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. టాలీవుడ్ లో అత్యంత క్రేజీగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఇదే అని చెప్పవచ్చు.
