Tuesday, February 10, 2026
HomeMovie Newsలిటిల్ హార్ట్స్ ఓవర్సీస్ రికార్డు.. మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ!

లిటిల్ హార్ట్స్ ఓవర్సీస్ రికార్డు.. మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ!

little-hearts-overseas-boxoffice-collections

చిన్న సినిమాగా థియేటర్లకు వచ్చిన లిటిల్ హార్ట్స్ ఇప్పుడు ఓవర్సీస్‌లో కూడా దుమ్మురేపుతోంది. మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా, వరల్డ్‌వైడ్‌గా పెద్ద హిట్టయింది.

ప్రత్యేకంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. వన్ మిలియన్ డాలర్ క్లబ్లోకి చేరి చిన్న సినిమాల రేంజ్‌ను పెంచేసింది. ఇది ఇప్పటివరకు చాలా తక్కువ తెలుగు సినిమాలకే సాధ్యమైన ఫీట్.

తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటి వరకు ఇండియాలో రూ.24.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ వసూళ్లు రూ.9 కోట్లకు పైగా చేరాయి.

దీంతో వరల్డ్‌వైడ్‌గా లిటిల్ హార్ట్స్ కలెక్షన్లు రూ.34 కోట్ల గ్రాస్ దాటాయి. రూ.30 కోట్లకు పైగా లాభాలు రావడం నిర్మాతలకు బంపర్ హిట్‌గా మారింది.

సినిమాలో తనుజ్ మౌళి, శివాని నాగారం జంటగా ఆకట్టుకున్నారు. రాజీవ్ కనకాల, నరేష్, సత్యకృష్ణన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు.

యంగ్ డైరెక్టర్ సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆదిత్య హాసన్ ఈటీవీ విన్ ఒరిజినల్ బ్యానర్ పై నిర్మించారు. థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular