Monday, January 19, 2026
HomeMovie NewsOG ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడి.. పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండి!

OG ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడి.. పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండి!

og-pre-release-event-pawan-kalyan-lb-stadium

పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా, రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేం. డీసీఎంగా బిజీగా ఉన్నప్పటికీ, అభిమానుల కోసం సినిమాలు చేస్తూ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన ఓజీ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో హైప్ పెరుగుతోంది.

సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ మూవీకి సుజీత్ దర్శకత్వం వహించగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాదులో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం వస్తే శిల్పకళా వేదికగా, లేకపోతే ఎల్బీ స్టేడియంలో జరుగుతుందని చెప్పిన మేకర్స్.. చివరికి ఎల్బీ స్టేడియంలోనే ఈవెంట్ ఫిక్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది.

ప్రస్తుతం వేదిక వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్ ను నేరుగా చూసే అవకాశం కోసం అభిమానులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. మాస్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

మొత్తం మీద, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ ఫ్యాన్స్ కి పండుగలా మారనుంది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో టీమ్ ముందుకు సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular