Monday, January 19, 2026
HomeMovie NewsOG ట్రైలర్ టాక్: ఓజాస్ గంభీర యాక్షన్ బ్లాస్ట్

OG ట్రైలర్ టాక్: ఓజాస్ గంభీర యాక్షన్ బ్లాస్ట్

ojas-gambheera-trailer-pawan-kalyan-mass

రెండేళ్లకు పైగా ఎదురు చూపుల తర్వాత ఓజీ ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్షణం సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీకి వేదిక అయింది.

ఆన్‌లైన్ రిలీజ్ ఆలస్యమైనా, చివరకు యూట్యూబ్‌లో విడుదలవడంతో సోషల్ మీడియాలో సంబరాలు మిన్నంటాయి.

ట్రైలర్‌లో స్టోరీని ఎక్కువ దాచలేదు. 90ల ముంబై మాఫియాను వణికిస్తున్న ఒమీ భావు (ఇమ్రాన్ హష్మీ)ను ఎదుర్కొనేందుకు సత్యదాదా (ప్రకాష్ రాజ్) పిలిపించే ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కళ్యాణ్) మళ్లీ ఎంట్రీ ఇస్తాడు.

ఫోన్‌లోనే శత్రువుకు వార్నింగ్ ఇచ్చే ఓజీ.. ఆపై విలయ తాండవం ప్రారంభమవుతుంది. మాఫియా నుంచి అతని అజ్ఞాతం, తిరిగి రావడానికి కారణం అసలు కథను మరింత ఆసక్తిగా మార్చాయి.

డైరెక్టర్ సుజీత్ తన ఫ్యానిజం మొత్తం ఈ ట్రైలర్‌లో చూపించాడు. బాషా, సత్య తరహా లైన్ అయినా.. ఓజీ ఇంటెన్స్ డ్రామా, వైల్డ్ క్యారెక్టరైజేషన్‌తో వేరే స్థాయిలో ఉంది. పవన్‌ను ఇంత వయోలెంట్ షేడ్‌లో చూడటం ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్‌గా మారింది.

సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ విజువల్స్ ను ఎత్తులో నిలబెట్టగా, తమన్ BGM ప్రతి ఫ్రేమ్‌ని ఎలివేట్ చేసింది. యాక్షన్ సీక్వెన్సులు ముంబై గ్యాంగ్‌స్టర్ వాతావరణాన్ని రియలిస్టిక్‌గా చూపించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular