
మిరాయ్ రివ్యూ & రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?
కథ:
“మిరాయ్” కథ పురాణాలు, చరిత్ర, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కలయికగా ఉంటుంది. కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపానికి లోనైన అశోకుడు తొమ్మిది గ్రంథాల్లో దివ్యశక్తులను దాచిపెడతాడు. ఆ గ్రంథాలు కాలక్రమంలో వేర్వేరు రక్షకుల దగ్గర ఉంటాయి. వాటిని తన చేతిలోకి తెచ్చుకొని దేవుడిగా మారాలని క్రూరుడు మహావీర్ (మంచు మనోజ్) ప్రయత్నిస్తాడు.
ఇందులో తొమ్మిదో గ్రంథాన్ని అంబిక (శ్రియా శరన్) కాపాడుతుంది. ఆమె కుమారుడు వేద (తేజ సజ్జ) యాదృచ్ఛికంగా మిరాయ్ శక్తిని పొందుతాడు. రక్షకుడిగా మారిన వేద, మహావీర్ నుంచి గ్రంథాన్ని రక్షించడమే ఈ కథలో ప్రధానాంశం. ఈ ప్రయాణంలో వేద ఎదుర్కొనే సవాళ్లే సినిమాకి హైలైట్.
విశ్లేషణ
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విజన్ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. పురాణాల నేపథ్యాన్ని ఆధునిక కాలానికి మేళవించి ఒక అడ్వెంచరస్ డ్రామా తీర్చిదిద్దాడు. విజువల్ ప్రెజెంటేషన్ బిగ్ స్క్రీన్ పై అద్భుతంగా కనిపిస్తుంది.
తేజ సజ్జ నటనలో సరైన ఇంప్రూవ్‌మెంట్ కనబడింది. సూపర్ హీరో లుక్, యాక్షన్ సీన్స్‌లో బాగా ఇంప్రెస్ చేశాడు. మరోవైపు మంచు మనోజ్ చేసిన ప్రతినాయక పాత్ర సినిమాకి మరో బలం. ఆయన పాత్రకు డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ కొత్తగా అనిపించింది.
శ్రియా శరన్, జగపతి బాబు, జైరాం, రితికా నాయక్ పాత్రలు కథకు బలం చేకూర్చాయి. కామెడీ ట్రాక్‌లో గెటప్ శ్రీను వినోదాన్ని పంచాడు. మొత్తంగా సినిమాకి తగినంత ఎంగేజ్‌మెంట్ ఉంది కానీ కొన్నిచోట్ల పేస్ తగ్గింది.
ప్లస్ పాయింట్స్
- తేజ సజ్జ యాక్షన్, ఎమోషన్స్.
- మంచు మనోజ్ విలన్‌గా పవర్‌ఫుల్ ప్రెజెన్స్.
- విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ డిజైన్.
- కార్తీక్ ఘట్టమనేని టెక్నికల్ ట్రీట్, కెమెరా వర్క్.
మైనస్ పాయింట్స్
- కథనం కొన్ని చోట్ల స్లోగా సాగడం.
- క్లైమాక్స్ మరింత ఎంగేజింగ్‌గా ఉండాలి.