Monday, August 10, 2026
HomeMovie Newsచెప్పుతో కొట్టే సీన్.. వెంకటేష్ చూపిన గొప్ప మనసు!

చెప్పుతో కొట్టే సీన్.. వెంకటేష్ చూపిన గొప్ప మనసు!

venkatesh-narappa-scene-story

విక్టరీ వెంకటేష్ ఎంత పెద్ద స్టార్ అయినా, తనతో నటించే సహనటుల పట్ల ఎప్పుడూ మంచి మనసు చూపిస్తారని అందరూ చెబుతారు. అలాంటి ఓ సంఘటనను నటుడు వశిష్ట సింహా రీసెంట్ ఇంటర్వ్యూలో షేర్ చేశాడు.

నారప్ప సినిమాలో వెంకటేష్, వశిష్టను చెప్పుతో కొట్టే సీన్ ఉందట. షూటింగ్ సమయంలో డమ్మీ చెప్పు ఉన్నా, నిజంగా తగిలితే నొప్పి కలిగిస్తుందేమోనని వెంకటేష్ ముందుగా ఆ చెప్పుతో తనను తానే కొట్టుకుని చూసారని వశిష్ట చెప్పాడు. ఆ తర్వాతే సీన్ చేశారు.

ఆ సమయంలో వెంకటేష్ కొట్టడానికి కాస్త ఇబ్బంది పడుతుంటే, “ఏమి కాదు సార్, మీరు చేసేయండి” అని వశిష్ట చెప్పాడట. కానీ ఇంత పెద్ద స్టార్ ఒక చిన్న యాక్టర్‌కు నొప్పి తగులుతుందా అని ఆలోచించడం తనకు గొప్పగా అనిపించిందని ఆయన గుర్తుచేసుకున్నాడు.

నారప్ప సినిమాతో వెంకీ మామ నుంచి తాను చాలా నేర్చుకున్నానని, ఆయనతో పని చేయడం తన కెరీర్‌లో ప్రత్యేక అనుభవమని వశిష్ట అన్నాడు.

ప్రస్తుతం వశిష్ట తెలుగు, తమిళ్‌లో నెగటివ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. త్రిబాణధారి బార్బరిక్ వంటి సినిమాల్లో కూడా కనిపించాడు.

ఇక వెంకటేష్ విషయానికొస్తే, ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు. ఈ దసరాకి ఫస్ట్ లుక్ రానుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular