Friday, March 13, 2026
HomeMovie Newsమిరాయ్‌లో స్టార్ సర్‌ప్రైజులు.. రానా పాత్రే హైలైట్!

మిరాయ్‌లో స్టార్ సర్‌ప్రైజులు.. రానా పాత్రే హైలైట్!

mirai-movie-rana-raviteja-dulquer-surprises

హనుమాన్‌తో సూపర్ సక్సెస్ అందుకున్న తేజ సజ్జ ఇప్పుడు మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ అడ్వెంచర్ సూపర్ హీరో సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.

ప్రస్తుతం మిరాయ్‌లో సర్‌ప్రైజ్ రోల్స్ పై ఆసక్తి పెరిగింది. తేజ సజ్జ స్వయంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండు ప్రత్యేక సర్‌ప్రైజులు ఉన్నాయని చెప్పడంతో బజ్ మరింత పెరిగింది. తాజాగా ఈ సర్‌ప్రైజులపై లీకులు బయటకు వచ్చాయి.

సినిమాలో రానా దగ్గుబాటి శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇది సినిమాకి పెద్ద హైలైట్ అవుతుందని చెబుతున్నారు. రానా స్పెషల్ ఎంట్రీ సినిమాకి మరింత భక్తి టచ్ ఇస్తుందని సమాచారం.

ఇక రవితేజ, దుల్కర్ సల్మాన్ కూడా కీలక రోల్స్‌లో కనిపించనున్నారని ప్రచారం ఉంది. అయితే ఈ అంశాలపై మేకర్స్ మాత్రం అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

సూపర్ హీరో జానర్‌లో వచ్చిన హనుమాన్ తర్వాత మిరాయ్ కూడా అద్భుతమైన విజువల్స్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుందని అంచనా. పలు స్టార్‌లు కలిసి నటించడం వల్ల సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తేజ సజ్జ కూడా ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు. హనుమాన్ తర్వాత మిరాయ్ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ సాధిస్తుందని ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular