
2025లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ‘ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం పాకిస్థాన్‌లో విడుదల కావడం, అక్కడ అద్భుతమైన స్పందన దక్కడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కరాచీలోని థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్షకులు చూస్తూ తన్మయత్వంతో పులకించిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే పాకిస్థాన్ వంటి దేశంలో ఒక హిందూ దేవుడిపై రూపొందిన సినిమాకు మంచి స్పందన రావడం అసలైన విజయం అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందూ పురాణాల నేపథ్యంలో సాగుతుంది. శ్రీ మహావిష్ణువు ఉగ్రరూపమైన నరసింహ అవతారం, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ యానిమేటెడ్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా రూ. 500 కోట్లు దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ సినిమా యానిమేషన్ విభాగంలో ఆస్కార్ అవార్డుకి నామినేషన్లలో చోటు దక్కించుకుంది. దర్శకుడి మాటల ప్రకారం, ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో నరసింహ మొదటి చిత్రం మాత్రమే.
