Friday, December 12, 2025
HomeMovie Newsబిగ్ బాస్ 9.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ఫిక్స్!

బిగ్ బాస్ 9.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ఫిక్స్!

big-boss-9-week-13-danger-zone-suman-shetty-sanjana-elimination

న్యూస్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 9 13వ వారంలోకి ఎంటరైంది. ఇంకో మూడు వారాలే ఆట ఉన్న ఈ టైంలో.. కెప్టెన్ కళ్యాణ్ ఇమ్మాన్యుయెల్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. ఇమ్మాన్యుయెల్‌ను ఎవరూ నామినేట్ చేయకపోవడం ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది.

ఈ వారం నామినేషన్స్‌లో భరణి, తనూజ, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, రీతు, సంజన ఉన్నారు. వీరిలో లీస్ట్ ఓటింగ్ కారణంగా సుమన్ శెట్టి సంజన డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తుంది.

అన్ అఫీషియల్ ఓటింగ్స్ చూస్తే.. సుమన్ శెట్టి ఎలిమినేషన్ దాదాపు పక్కా అనేలా ఉన్నాయి. ఈ వారం సుమన్ లేదా సంజనలలో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని అంచనా వేస్తున్నారు.

సుమన్ శెట్టి హౌస్‌లో లోన్లీగా ఉండటం ఎనర్జీ చూపించకపోవడం మైనస్ పాయింట్‌గా మారింది. మరోపక్క సంజన ఫైట్స్ రీతు డీమాన్ ఇష్యూస్ వల్ల నెగిటివిటీ తెచ్చుకున్నా ప్రేక్షకులు ఆమెను సేఫ్ చేస్తూ వచ్చారు.

గత రెండు వారాలు యాక్టివ్‌గా ఉన్న భరణి ఈ వారం సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే టికెట్ టు ఫినాలే మొదటి రౌండ్‌లోనే సంజన ఎలిమినేట్ అవ్వడం ఆమెకు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఈ ఎలిమినేషన్‌తో టాప్ 5 లేదా 6 ఎవరు అన్నది ఫైనల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular