
సౌత్ సినిమా లవర్స్‌కి ఇప్పుడొకే ఒక అంచనాల ప్రాజెక్ట్ ఉంది.. అది ‘ఖైదీ 2’. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి భాగం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్‌నే ఏర్పరచింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ప్రాజెక్ట్ గురించి లోకేష్ ఓ బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు.
ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘కూలీ’ చిత్రం తర్వాత ఖైదీ 2నే స్టార్ట్ చేస్తానని అధికారికంగా వెల్లడించాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. “ఖైదీ 2 కోసం 30 నుంచి 35 పేజీలకు పైగా స్క్రిప్ట్ రెడీ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. సినిమా బాగా రావడం ఖాయం” అని చెప్పడంతో, ఫ్యాన్స్‌లో మరింత క్రేజ్ పెరిగింది.
లోకేష్ సొంతంగా రూపొందించుకున్న తన సినిమాటిక్ యూనివర్స్‌లో ‘ఖైదీ’కి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే దీనిపై ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
అందులోనూ మ్యూజిక్ మ్యాజీషియన్ అనిరుధ్ మ్యూజిక్, కార్తీ యాక్షన్, లోకేష్ టేకింగ్.. ఇవన్నీ మళ్లీ స్క్రీన్‌పై చూపించబోతున్నారు. ‘ఖైదీ 2’లో డార్క్ యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉండేలా ఉన్నట్లు సమాచారం. ఈసారి భారీ స్థాయిలో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా సినిమాను తెరకెక్కించాలనే ప్లాన్ ఉంది.
ఇప్పటికే లోకేష్ ‘కైతి’, ‘విక్రమ్’, ‘లియో’ సినిమాలతో తన యూనివర్స్‌ను బలంగా ఏర్పరచుకున్నాడు. ఇందులో మరో కీలక భాగంగా ‘ఖైదీ 2’ ఉంటుంది. ఈ సినిమా కథలో భాగంగా సూర్య లేదా కమల్ హాసన్ పాత్రలు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.