Wednesday, June 10, 2026
HomeMovie Newsకాంతార చాప్టర్ 1: 700 కోట్ల దిశగా రిషబ్ శెట్టి

కాంతార చాప్టర్ 1: 700 కోట్ల దిశగా రిషబ్ శెట్టి

kantara-chapter1-boxoffice-700cr-collection

రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రిలీజ్‌ అయిన పది రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్‌ దాటిన ఈ చిత్రం, ఇప్పుడు 700 కోట్ల లక్ష్యాన్ని చేరే దిశగా పయనిస్తోంది. వీకెండ్ కలెక్షన్లు ఎలాంటి సినిమా సత్తా చూపాలో రుజువు చేశాయి.

కొత్తగా వచ్చిన ‘శశివదనే’, ‘ఆరి’, ‘కానిస్టేబుల్’ వంటి సినిమాలు విఫలమవడంతో కాంతారకు బాక్సాఫీస్‌లో క్లియర్ రన్ లభించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం దీపావళి నాటికి సినిమా 700 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది. నిన్న ఒక్కరోజే సుమారు 55 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఇండియాలో కాంతార రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తుండగా, ఓవర్సీస్ మార్కెట్‌లో బ్రేక్ ఈవెన్ దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌కు అనూహ్యమైన రెస్పాన్స్‌ రావడం విశేషం. రిషబ్‌ శెట్టి స్వయంగా ముంబై సింగిల్ స్క్రీన్‌ల్లో ప్రమోషన్‌ చేస్తూ సినిమాకు హైప్‌ పెంచుతున్నారు.

దీపావళి తర్వాత కొత్త సినిమాల ఎంట్రీ ఉన్నా, కాంతార దూకుడు తగ్గే సూచనలు లేవు. ‘KGF 2’ తర్వాత కన్నడ ఇండస్ట్రీకి భారీ ఇంపాక్ట్ తెచ్చిన మూవీగా ఇది నిలిచింది. చాప్టర్ 2 కోసం ఉత్కంఠ పెరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular