
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ, సినిమాలపై ఫోకస్ తగ్గించలేదు. హరిహర వీరమల్లు, ఓజీ వంటి సినిమాలతో థియేటర్లలో వరుసగా సందడి చేశారు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ దాదాపు పూర్తి దశలో ఉంది.
ఈ సినిమా నవంబర్ చివర్లో పూర్తవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక పవన్ నెక్స్ట్ సినిమా ఏమిటన్న ప్రశ్న అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఓజీ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ “నేను పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను” అన్నారు. అంటే, ఆయనతో మరోసారి సినిమా చేయాలనే ఆలోచన ఉందని క్లియర్ చేశారు.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామాగా ఉండబోతుందని చెబుతున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం హను రాఘవపూడి, పూరీ జగన్నాథ్, వెంకీ అట్లూరీ లాంటి డైరెక్టర్లతో సినిమా చేయాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు.
పవన్ దిల్ రాజు బంధం కొత్తది కాదు. తొలి ప్రేమ రోజుల్లోనే వీరి పరిచయం మొదలై, వకీల్ సాబ్ ద్వారా బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కాంబో మళ్లీ కలిస్తే భారీ హైప్ క్రియేట్ అవడం ఖాయం. మరి పవన్ కళ్యాణ్ మరోసారి దిల్ రాజుకి ఛాన్స్ ఇస్తారా? చూడాలి మరి.
