Friday, June 27, 2025
HomeMovie Newsకన్నప్ప మూవీ రివ్యూ & రేటింగ్

కన్నప్ప మూవీ రివ్యూ & రేటింగ్

kannappa-movie-review-prabhas-vishnu-emotional-drama

కథ:

ఈ కథ 2వ శతాబ్దంలో కాళహస్తి ప్రాంతాన్ని నేపథ్యంగా కలిగి ఉంటుంది. ఐదు తెగల మధ్య విభేదాల నేపథ్యంలో, తిన్నడు (మంచు విష్ణు) అనే యువకుడు తన చిన్ననాటి దుర్ఘటనతో దేవుడి మీద నమ్మకం కోల్పోయి, నాస్తికుడిగా మారతాడు. మరోవైపు, వాయులింగాన్ని రక్షించేందుకు తన జీవితాన్నే అంకితం చేసిన మహాదేవ శాస్త్రి (మోహన్ బాబు) ఉంటాడు. ఈ శివలింగాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకునే కాలా ముఖుడు (అర్పిత్ రాంక్) తెగల మధ్య కలహాలకు కారణమవుతాడు. ఈ నేపథ్యంలో తిన్నడును కన్నప్పగా మారుస్తూ, రుద్రుడు (ప్రభాస్) చూపే మార్గం ఏమిటనేదే అసలు కథ.

విశ్లేషణ:

విష్ణు తన నటనతో ఈ సినిమాని తన మీదే ఆధారపడి నడిపించాడు. మొదటి భాగంలో కథనం కొంత నెమ్మదిగా సాగినా, ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమాకు వేగం వచ్చింది. దైవత్వాన్ని సమర్థవంతంగా చూపించడంలో దర్శకుడు మంచి ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ ఎలివేషన్స్ సినిమా హైలైట్ గా నిలిచాయి.

ఈ చిత్రంలో మ్యూజిక్, విజువల్స్‌ వంటి అంశాలు దైవికతకు పుష్కలంగా సహకరించాయి. ముఖ్యంగా సన్నివేశాలను ఎమోషనల్ గా ఎలివేట్ చేయడంలో స్టీఫెన్ డావెస్సి సంగీతం బాగా పని చేసింది. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి నటుల పాత్రలు చిన్నవైనా సినిమాకి బలాన్ని ఇచ్చాయి. శివుడు, పార్వతులుగా వీరి ప్రెజెన్స్ విశిష్టంగా అనిపిస్తుంది.

అలాగే దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ చేసిన శ్రమ బాగానే కనిపిస్తుంది. మంచి స్క్రీన్ ప్లే, పలు మలుపులతో కథను నడిపిస్తూ  నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తి ఎలా భక్తుడిగా మారాడు అనే మార్పును బలంగా చూపించగలిగారు. అయితే మధ్యలో కొన్ని అనవసరమైన సన్నివేశాలను కత్తిరించి ఉంటే, సినిమా మరింత బలంగా నిలబడేదే.

ప్లస్ పాయింట్స్

మంచు విష్ణు నటన

ప్రభాస్ రోల్

మోహన్ లాల్, మోహన్ బాబు పాత్రలు:l

డివోషనల్ ఎమోషన్స్, క్లైమాక్స్ 

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్ లో నెమ్మదిగా కథనం

రొమాంటిక్ ట్రాక్: హీరోయిన్ పాత్రను తగ్గించి ఉంటే బాగుండేది.

యాక్షన్ సీన్లు: తెగల మధ్య యుద్ధ సన్నివేశాలు బలహీనంగా అనిపించాయి.

రేటింగ్: 3/5

kannappa, manchu vishnu, prabhas cameo, devotional movies, telugu movie review,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular