స్పోర్ట్స్ డెస్క్: IND vs ENG: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన హెడింగ్లీ టెస్టులో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి కారణాల్లో ఒకటి యువ ఫీల్డర్ యశస్వి జైస్వాల్ క్యాచ్ మిస్‌లే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కీలక సమయంలో జైస్వాల్ నాలుగు క్యాచ్‌లను వదిలేయడంతో బౌలర్ల ఆరాటం వృథా అయింది. టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 371 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉండగా, డకెట్ బ్యాట్ నుంచి వచ్చిన టాప్ ఎడ్జ్‌ను సిరాజ్ బౌలింగ్‌పై జైస్వాల్ డ్రాప్ చేశాడు.
టెస్టులో మొత్తంగా 4 అవకాశాలు వదిలేయడంతో టీమిండియా చేతులారా విజయాన్ని దూరం చేసుకుంది.
ఈ పరిస్థితుల్లో బౌలర్ సిరాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేయగా, కెప్టెన్ గిల్ నిరాశ చెందినట్లు కనిపించాడు. ముఖ్యంగా కెమెరా గౌతమ్ గంభీర్ వైపు తిరగడంతో అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది.
ఇంతటి నిర్ణాయక దశలో క్యాచ్‌లు వదలడం భారత అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. జైస్వాల్ టాలెంట్ ఉన్న ఆటగాడైనా, ఫీల్డింగ్‌లో నిర్లక్ష్యం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది.
ఈ టెస్టు ఓటమితో సిరీస్‌లో 1-0తో ఇంగ్లాండ్ ముందంజలో ఉంది. భారత జట్టు త్వరగా పునరాగమనం చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
