
న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 2026 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదన తీవ్ర విమర్శలకు గురైంది. ఇరాన్‌పై అమెరికా దాడుల తర్వాత ఈ ప్రతిపాదనపై పాక్ దేశవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది.
ప్రతిపక్షాలు షరీఫ్ ప్రభుత్వాన్ని ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్రంప్ వంటి వ్యక్తికి శాంతి బహుమతి సూచించడం దేశానికి కళంకమని పీటీఐ నేత అలీ ముహమ్మద్ ఖాన్ మండిపడ్డారు.
ఇజ్రాయెల్ దాడులకు మద్దతు ఇచ్చిన ట్రంప్ ఎలా శాంతికాముకుడవుతారని మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ప్రశ్నించారు. పాక్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ భేటీ తర్వాతే ఈ ప్రతిపాదన వచ్చినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి.
మాజీ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, ట్రంప్ యుద్ధాల ఆరాధకుడని, ఆయన చేతులకు నోబెల్ శాంతి బహుమతి అర్హత లేదని వ్యాఖ్యానించారు.
ఈ ప్రతిపాదనతో పాక్ ప్రభుత్వం అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటుండగా, ట్రంప్ మీద వ్యతిరేకత పాకిస్తాన్లో కొత్త రాజకీయ దుమారం రేపుతోంది.
trump nobel prize, pakistan controversy, iran attack, pti opposition, nobel 2026 politics,
