
ఏపీ: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌పై మరో కొత్త పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసు ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో జరిగిన పర్యటనకు సంబంధించి దాఖలైంది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో, ముందస్తు అనుమతిలేకుండా జగన్ యార్డులో పర్యటించారన్న ఆరోపణలతో నల్లపాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ప్రాంగణంలో రాజకీయ ప్రసంగాలు చేశారన్న కారణంగా ఆయనపై కేసు నమోదైంది.
ఈ కేసులో జగన్‌తో పాటు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. వీరందరికీ పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు.
పోలీసు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో వైసీపీ నేతలందరికీ ఇది కొత్త చిక్కుగా మారింది.
ఇప్పటికే పల్నాడు ఘటనపై కేసు ఉన్న జగన్‌కు ఇది మరో నేర నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
