
న్యూస్ డెస్క్: భారతీయ రైల్వే ప్రయాణికులపై ప్రయాణ ఛార్జీల భారాన్ని మోపుతోంది. జూలై 1 నుంచి రైల్వే ఛార్జీలు పెరిగేలా నిర్ణయం తీసుకుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ ప్రయాణ ఛార్జీ కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతిలో 2 పైసలు పెరుగనున్నాయి.
అయితే సబర్బన్ టికెట్లపై ఈ పెంపు ప్రభావం ఉండదు. అలాగే 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ టికెట్ల ధరలో మార్పు లేదు. కానీ దానికంటే ఎక్కువ ప్రయాణిస్తే అర్ధ పైసా చొప్పున ఛార్జీ పెరుగుతుంది.
తత్కాల్ టికెట్ల బుకింగ్ విషయంలో కీలక మార్పు చేస్తూ, ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరిచారు. జూలై 1 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ చేయాలంటే ఆధార్ లింక్ తప్పనిసరి.
అలాగే జూలై 15 నుంచి ఓటీపీ ద్వారా అదనపు ధృవీకరణ కూడా తప్పనిసరి. ఏజెంట్లపై కొన్ని నిబంధనలు విధిస్తూ, నిర్ణిత సమయాల్లో బుకింగ్‌ను అడ్డుకున్నారు.
రైల్వే శాఖ ఈ మార్పులను ప్రయాణికుల సౌకర్యం కోసం, తత్కాల్ టికెట్లను పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చింది.
