
న్యూస్ డెస్క్: డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటుడు శ్రీరామ్ తాజాగా కోర్టు ముందు వివరణ ఇచ్చారు. సోమవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం ఆయనను ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు.
“నేను డ్రగ్స్ అమ్మలేదు. తెలుసు, సెలబ్రిటీగా ఉండి ఈ రకంగా డ్రగ్స్ కొనడం తప్పు. అయినా, నేను ఎవరికీ విక్రయించలేదు” అని శ్రీరామ్ తెలిపారు. తన ఈ నిర్వాహకతపై చింతిస్తున్నట్లు తెలిపారు.
శ్రీరామ్ తన కుమారుడు తీవ్ర అనారోగ్యంలో ఉన్నాడని, తానే కుటుంబ సంరక్షకుడని పేర్కొన్నారు. తక్షణ బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.
పోలీసులు శ్రీరామ్‌ను ఎనిమిది గంటలపాటు విచారించినట్లు సమాచారం. రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు ఆయనను జూలై 7 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించింది.
ఈ కేసు టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ మాఫియా చర్చకు తెరతీశింది. పరిశ్రమలో మత్తుపదార్థాల వినియోగంపై మరోసారి దృష్టి కేంద్రీకరించింది.
