
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ టెస్ట్ సమయంలో అంపైర్లపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు ఆయనను ఐసీసీ హెచ్చరించింది.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 61వ ఓవర్ సమయంలో పంత్ బంతి ఆకృతి గురించి అంపైర్లతో వాదించాడు. అంపైర్లు బంతిని మార్చేందుకు నిరాకరించడంతో పంత్ భూమికి బంతిని కొట్టాడు.
ఈ చర్యను ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ఉల్లంఘనగా పేర్కొంది. దీనిపై మ్యాచ్ అంపైర్లు నివేదించగా, రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ పంత్‌ను అధికారికంగా మందలించారు.
ఈ చర్యలో భాగంగా పంత్ ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ చేర్చారు. గత 24 నెలల్లో ఇది పంత్‌కు మొదటి ప్రవర్తనా తప్పిదం కావడం గమనార్హం.
పంత్ శిక్షను అంగీకరించడంతో విచారణ అవసరం లేకుండానే వ్యవహారం ముగిసింది. ఐసీసీ ప్రకారం ఇది లెవెల్ 1 ఉల్లంఘనగా పరిగణించబడింది.
