Sunday, May 31, 2026
HomeMovie Newsఎన్టీఆర్ కొత్త లుక్‌కి ఫ్యాన్స్ షాక్ అయ్యారా?

ఎన్టీఆర్ కొత్త లుక్‌కి ఫ్యాన్స్ షాక్ అయ్యారా?

jr-ntr-latest-lean-look-photos

టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త లుక్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. తాజాగా బయటకు వచ్చిన ఫోటోల్లో తారక్ చాలా సన్నగా కనిపించడంతో ఫ్యాన్స్ మధ్య చర్చ మొదలైంది.

డ్రాగన్’ చిత్రానికి సిద్ధమవుతున్న ఎన్టీఆర్, తన పాత్ర కోసం బరువు గణనీయంగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, ముఖంలో పాత ఎనర్జీ లేదని కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఓ ఫ్యాన్‌తో దిగిన ఫోటోలో తారక్ బావమరిది పెళ్లిలో కనిపించిన లుక్‌కి పూర్తి విరుద్ధంగా ఉన్నారని నెటిజన్లు అంటున్నారు.

ఇదిలా ఉండగా, కొంతమంది మాత్రం “సినిమా కోసం అయితే పర్లేదు” అని ఎన్టీఆర్ డెడికేషన్‌ని ప్రశంసిస్తున్నారు.

వర్కౌట్‌తో శరీరాన్ని మార్చడం హీరోలలో చాలా అరుదని, తారక్ మాత్రం ప్రతి పాత్రకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతారని అంటున్నారు. త్వరలోనే పవర్‌ఫుల్ లుక్‌లో తిరిగి కనిపిస్తారని అభిమానులు నమ్ముతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular