
టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలలో దిల్ రాజు పేరు ముందుంటుంది. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి మరో ప్రతిభావంతుడు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.
దిల్ రాజు సోదరుడి కొడుకు హర్షిత్ రెడ్డి ఇప్పటికే నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. ‘బలగం’, ‘లవ్ మీ’, ‘జనక అయితే గనక’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న హర్షిత్, ఇప్పుడు దర్శకత్వంలో అడుగుపెట్టబోతున్నాడట.
సమాచారం ప్రకారం, ఒక పెద్ద స్టార్ హీరో కోసం కథను రెడీ చేసి, ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించాడు. మరోవైపు, హర్షిత్ కజిన్ సుమన్ తేజ్ హీరోగా ‘సీతాకల్యాణ వైభోగమే’ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నారు.
దీంతో దిల్ రాజు కుటుంబం నుంచి నిర్మాతలతో పాటు హీరోలు, ఇప్పుడు దర్శకులు కూడా వస్తున్నారని చెప్పవచ్చు. హర్షిత్ రెడ్డి దర్శకత్వంలో వచ్చే తొలి సినిమా ఏమిటో అనే ఉత్కంఠ ఫిలింనగర్‌లో పెరిగిపోతోంది.
