
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో గేమ్ పూర్తిగా మారిపోయింది. దువ్వాడ మాధురి, చిట్టి పికిల్స్ రమ్య ఎంట్రీలు షోకి కొత్త ఉత్సాహం తెచ్చాయి.
హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే ఇద్దరూ తమ స్టైల్‌లోనే ఆటను మొదలుపెట్టారు.
మాధురి కిచెన్ చుట్టూ చురుకుగా తిరుగుతూ దివ్య, కళ్యాణ్‌లతో వాగ్వాదంలో పడ్డారు. మరోవైపు రమ్య నామినేషన్స్ సమయంలో డీమాన్ పవన్‌పై బుర్ర లేదని వ్యాఖ్యానించి వివాదం రేపింది.
ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రేక్షకులు ఆమెపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.
ఇక కళ్యాణ్‌తో రమ్య వాగ్వాదం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. హౌస్‌లో ఈ ఇద్దరి ప్రవర్తన చుట్టూ చర్చలు నడుస్తున్నాయి. రమ్య, మాధురి టార్గెట్‌గా మారుతారా లేక గేమ్‌ను మలుపు తిప్పుతారా అనేది రాబోయే ఎపిసోడ్లలో తేలనుంది.
