
యంగ్ హీరో సుధీర్ బాబు తన రెగ్యులర్ జానర్ మార్చారు. ఈసారి ‘జటాధర’ అంటూ ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్, ఇది రెగ్యులర్ దెయ్యాల కథ కాదని, ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రాబోతుందని స్పష్టం చేసింది.
ట్రైలర్ ప్రకారం, ఇది నిధి వేట కాదు, పిశాచి ఆట. పురాతన “లంకె బిందెలు”, వాటికి కాపలాగా ఉండే “ధన పిశాచి” చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ భయంకరమైన పిశాచి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా విశ్వరూపం చూపించారు. ఆమె లుక్స్, అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి.
సుధీర్ బాబు ఈ చిత్రంలో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఆ పిశాచి బంధనాన్ని ఛేదించే శివ భక్తుడిగా, త్రిశూలంతో ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి.
ట్రైలర్లో విజువల్స్, గ్రాఫిక్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. రాజీవ్ రాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్.. మైథాలజీకి గ్రాఫిక్స్ జోడించి, ఓ విజువల్ ఫీస్ట్‌లా సినిమాను మలిచినట్లు కనిపిస్తోంది.
మొత్తం మీద, ‘జటాధర’ ట్రైలర్ ఒక కొత్త రకం ఫాంటసీ, యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించేలా ఉంది. నవంబర్ 7న విడుదల కానున్న ఈ సినిమా, సుధీర్ బాబుకు ఈ కొత్త జానర్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
