
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రమోషన్ల కోసం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. నవంబర్ 7న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఆమె బిగ్‌బాస్ నుంచి టాక్ షోల వరకు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే, జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోకు హాజరయ్యారు.
ఈ షోలో రష్మిక తన సినిమా, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. షో మధ్యలో జగపతిబాబు.. “మగవారికి కూడా పీరియడ్స్ రావాలని నువ్వు గట్టిగా కోరుకుంటున్నావు కదా?” అని రష్మికను అడిగారు. దీనికి ఆమె ఏమాత్రం తడుముకోకుండా “అవును” అని బలంగా సమాధానమిచ్చారు.
ఆమె అక్కడితో ఆగకుండా, “మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి. అప్పుడే మహిళలు ప్రతినెలా అనుభవించే ఆ నొప్పి, బాధ, నరకం ఏంటో వారికి అర్థమవుతుంది” అంటూ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె అభిప్రాయాన్ని కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు మిశ్రమంగా స్పందిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’లో రష్మిక సరసన దీక్షిత్ శెట్టి నటించారు.
‘పుష్ప’, ‘యానిమల్’ వంటి పాన్-ఇండియా హిట్ల తర్వాత రష్మిక నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆమె ప్రస్తుతం ‘కుబేర’, ‘సికందర్’, ‘మైసా’, ‘రెయిన్‌బో’ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
