Thursday, September 3, 2026
HomeMovie Newsహరిహర వీరమల్లు సీక్వెల్ టైటిల్ ఇదే!

హరిహర వీరమల్లు సీక్వెల్ టైటిల్ ఇదే!

hari-hara-veera-mallu-sequel-title-revealed

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 23న రాత్రి ప్రీమియర్ షోలు, మరికొన్ని చోట్ల నేడు ఉదయాన్నే రిలీజ్‌తో సందడి చేసింది. ఐదేళ్ల పాటు షూటింగ్ జరిపిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించారు.

ఈ చిత్రానికి క్రిష్‌, జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎం రత్నం సమర్పణలో దయాకరరావు నిర్మించారు. మొదటి భాగం ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ టైటిల్‌తో వచ్చింది. మేకర్స్ ఇప్పటికే రెండో భాగాన్ని ప్రకటించారు.

తాజాగా, పార్ట్-1 ముగిసే సమయంలో సీక్వెల్ టైటిల్ ‘హరిహర వీరమల్లు పార్ట్ 2 – బ్యాటిల్ ఫీల్డ్’ అని ప్రకటించారు. అసలైన యుద్ధం రెండో భాగంలోనే జరిగేలా ప్లాన్ చేశారని అర్థమవుతోంది. తొలి భాగం చివర్లో పవన్ పాత్ర కోహినూర్ వజ్రం కోసం ఢిల్లీకి బయలుదేరుతాడు, బాబీ డియోల్ పాత్ర ఔరంగజేబ్ అడ్డుపడతాడు.

ఇప్పుడు సీక్వెల్‌లో వీరిద్దరి మధ్య మరింత ఆసక్తికరంగా సంఘర్షణ జరగనుందని తెలుస్తోంది. టైటిల్‌ను అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇప్పటికే పార్ట్ 2లో 20 నిమిషాల షూటింగ్ పూర్తయిందని నిధి అగర్వాల్ తెలిపారు.

త్వరలో పార్ట్ 2 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

pawan kalyan, hari hara veera mallu, sequel, krish, tollywood,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular