Thursday, April 16, 2026
HomeMovie Newsఇకపై నో బ్రేక్.. స్పిరిట్ షూటింగ్ అప్పటినుంచే..

ఇకపై నో బ్రేక్.. స్పిరిట్ షూటింగ్ అప్పటినుంచే..

prabhas-spirit-movie-shooting-starts-in-september

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యే సరికి, సెప్టెంబర్ లో చిత్రీకరణ మొదలవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్ మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించేందుకు టీం రెడీ అవుతోంది. ఇప్పటికే అక్కడ లొకేషన్స్ పరిశీలించారని దర్శకుడు వంగా తెలిపారు. రాజా సాబ్ సినిమాను ప్రభాస్ త్వరగా పూర్తి చేసి, వెంటనే స్పిరిట్ ప్రాజెక్టులో జాయిన్ అవ్వనున్నట్లు టాక్.

ప్రభాస్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. డిఫరెంట్ లుక్, మాస్ ఎలివేషన్స్‌తో సందడి చేయనున్నారని చెప్పొచ్చు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది.

భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాటల వర్క్ కంప్లీట్ అయ్యిందని సమాచారం.

ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెగ ఎదురుచూస్తున్నారు. మరి త్వరలోనే అధికారిక అప్డేట్ రావొచ్చని ఊహిస్తున్నారు.

prabhas, spirit, sandeep reddy vanga, tollywood, shooting,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular