
కథ:
హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్) కథ 1650 నాటి కొల్లూరు నేపథ్యంలో సాగుతుంది. మొగలాయిలు భారతదేశంపై తమ ఆధిపత్యాన్ని చూపిస్తూ, అతి విలువైన కోహినూర్ వజ్రాన్ని అధికారం కోసం సాధించాలనుకుంటారు. దీనిని కాపాడే బాధ్యత గోల్కొండ పాలకుడు కుతుబ్ షా (దలీప్ తహిల్) మీద ఉంటుంది. అయితే, ఈ మిషన్‌లో విజయవంతం కావడానికి అతడు తెలివైన వజ్రాల దొంగ అయిన హరిహర వీరమల్లును ఆశ్రయిస్తాడు. ఈ నేపథ్యంలో కోహినూర్ వెనుక దాగిన మిస్టరీ ఏమిటి, వీరమల్లు గతంలో జరిగిన సంఘటనలు, ఔరంగజేబుతో అతనికి ఉన్న మలుపులు ఎలా మారతాయన్నది సినిమాకి మెయిన్ హైలైట్.
విశ్లేషణ:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది సూపర్ మాస్ ట్రీట్. ఫస్ట్ హాఫ్ నుండి సినిమాలో పవన్ ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, పీరియాడిక్ గెటప్ ఆడియెన్స్‌ను బాగా ఎంగేజ్ చేస్తాయి. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్, కొన్ని కీలక యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకులను ఊరెత్తిస్తాయి. కథనం పురాణపు కథలా సాగుతూ ప్రాచీన భారతదేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో దర్శకులు క్రిష్ – జ్యోతిక్రిష్ణ సక్సెస్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం.
పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రణలో కనిపించే పరిపక్వత, యాక్షన్ సీన్స్‌లోని ఎనర్జీ సినిమా మొత్తం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొల్లూరు నేపథ్యం, కోహినూర్ వజ్రం చుట్టూ నడిచే కథ కథనానికి ఆసక్తికర మలుపులను తెస్తుంది. దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణలు పవన్ యాక్టింగ్ టాలెంట్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. అలాగే ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ భాగాల్లో వచ్చిన భావోద్వేగాలు సినిమాకు మరింత బలం అందించాయి.
అయితే సినిమా విజువల్ ట్రీట్ అయితేనేం, సెకండ్ హాఫ్‌లో కథనం కొంత నెమ్మదించడంతో పేస్ డ్రాప్ అయిందని చెప్పాలి. అలాగే, కీలక సన్నివేశాల్లో గ్రాఫిక్స్ పరంగా అందుకోలేకపోయింది. అయినా పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, పీరియాడిక్ మూడ్, సంగీతం సినిమాను మళ్లీ పట్టుకుంటాయి. రెండవ భాగానికి బలం చేకూర్చేలా ఎమోషనల్ హై ముడిపడే విధంగా కథను ముగించారు.
ప్లస్ పాయింట్స్:
-పవన్ కళ్యాణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, కొత్త గెటప్‌లో తన నటన.
-పీరియాడిక్ సెట్టింగ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ విలువలు, బిగ్ స్కేల్ యాక్షన్ ఎపిసోడ్స్.
-కథనం సెకండ్ హాఫ్‌లో స్థాయి తగ్గడం
-విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని సన్నివేశాల్లో వాస్తవికంగా లేకపోవడం.
-ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే పైన మరింత ఫోకస్ పెట్టి ఉంటే బెటర్‌గా ఉండేది.
రేటింగ్: 2.75/5
మొత్తానికి, హరిహర వీరమల్లు – పార్ట్ 1 మాస్ ఎలివేషన్ మూడ్‌లో పవన్ కళ్యాణ్ మేజిక్‌ని మరోసారి చూపించే సినిమా. కొన్ని లోపాలు పక్కన పెడితే, ఫ్యాన్స్‌కు మాత్రం పక్కా ఎంటర్‌టైన్‌మెంట్.
