
ఘాటి మూవీ రివ్యూ
కథ
ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దుల్లో గంజాయి మోత కూలీలుగా జీవించే కుటుంబానికి చెందిన శీలావతి (అనుష్క) జీవితం కఠిన పరిస్థితుల్లో సాగుతుంది. చిన్నప్పటి నుంచే గంజాయి రవాణా పనిలో పాల్గొన్న ఆమె, దేశిరాజు (విక్రమ్ ప్రభు)తో బతికిపోడానికి పోరాడుతుంది. ఒక అనూహ్య సంఘటన తర్వాత వీరిద్దరూ ఆ పనిని మానేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని నిర్ణయిస్తారు. కానీ స్థానిక గంజాయి వ్యాపార మాఫియాలతో ఎదురుపడటం వల్ల శీలావతి, దేశిరాజు జీవితాలు మరోసారి హింస, ప్రతీకారాల వలయంలో చిక్కుకుంటాయి. మాఫియాతో వీరి పోరాటం ఎటు దారి తీసిందన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
దర్శకుడు క్రిష్ ఎప్పటిలాగే కొత్త నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. గంజాయి కూలీల జీవితం, వారిలోని బలహీనతలు, బలాలు చూపించడానికి ప్రయత్నించాడు. కథ ఆరంభం ఆసక్తిగా సాగుతుందని అనిపించినా, ఇంటర్వెల్ తర్వాత పాత రివెంజ్ డ్రామా ఫార్ములాలోనే కదులుతుంది.
అనుష్క వంటి స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ, ఆమె పాత్రకు సరైన ఎమోషనల్ లెవెల్ ఇవ్వలేకపోయారు. ఆమె పాత్రలో చురుకుదనం, నాటకీయత ఉన్నా, భావోద్వేగాన్ని మిస్సవ్వడంతో ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వడం కష్టం. విక్రమ్ ప్రభు తన పాత్రలో బాగా నటించాడు కానీ, అనుష్క ఇమేజ్‌ను మించేంత ప్రాధాన్యం తీసుకున్నట్లు కనిపించింది.
సాంకేతికంగా సినిమాకు మంచి బలం ఉంది. పశ్చిమ కనుమల విజువల్స్ ఆకట్టుకుంటాయి. కానీ సంగీతం, ముఖ్యంగా పాటలు ప్రభావం చూపలేకపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్నిచోట్ల మరీ లౌడ్‌గా అనిపిస్తుంది. క్రిష్ నుంచి ఆశించే ఆ భావోద్వేగ గాఢత ఈసారి రాలేదనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
- గంజాయి కూలీల కథనం అనే విభిన్నమైన నేపథ్యం
- పశ్చిమ కనుమల్లో దృశ్యాలు, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
- అనుష్క పాత్రలో ఏమోషన్ మిస్సింగ్
- రెండో భాగం రొటీన్ రివెంజ్ డ్రామాగా మారిపోవడం
- సంగీతం, క్లైమాక్స్ బలహీనంగా ఉండటం
రేటింగ్ – 2.50/5