
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కిష్కింధపురి మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమా, హారర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతుండటంతో ట్రైలర్ నుంచే మంచి హైప్ క్రియేట్ అయింది.
సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే, ఆంధ్ర హక్కులను రూ.3 కోట్లకు, నైజాం హక్కులను రూ.1.5 కోట్లకు, సీడెడ్ హక్కులను రూ.1 కోట్లకు విక్రయించినట్టు టాక్ వినిపిస్తోంది.
మేకర్స్ తక్కువ రేట్లకే హక్కులను విక్రయించడంతో, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు వచ్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
నార్మల్ గా ఈ రైట్స్ ఎక్కువ మొత్తంలో విక్రయించే అవకాశం ఉండేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. కానీ నిర్మాతలు నాన్ రికవరబుల్ అడ్వాన్సుల రూపంలో హక్కులను డీల్ చేసినట్టు సమాచారం. ఇది డిస్ట్రిబ్యూటర్లకు రిస్క్ తగ్గించే విధానం అని అంటున్నారు.
సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గతంలో రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ జోడీగా నటించిన ఆమె, ఇప్పుడు మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేస్తున్నారు. ఆ సినిమాకు వచ్చిన మంచి టాక్, ఈ సినిమా పై మరింత పాజిటివ్ అంచనాలు పెంచుతోంది.
