
న్యూస్ డెస్క్: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఈ షాపింగ్ ఫెస్టివల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుండగా, ప్లస్ మరియు బ్లాక్ సభ్యులకు సెప్టెంబర్ 22 నుంచే యాక్సెస్ లభించనుంది.
ఇప్పటికే సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమైన అర్లీ బర్డ్ డీల్స్ వినియోగదారుల్లో ఆసక్తిని పెంచాయి. బ్యూటీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఈసారి ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ సేవ కూడా బిగ్ బిలియన్ డేస్‌లో భాగమైంది. దేశవ్యాప్తంగా 19 నగరాల్లో 3 వేల పిన్‌కోడ్లకు కేవలం 10 నిమిషాల్లో డెలివరీ సౌకర్యం అందించనున్నారు.
స్మార్ట్‌ఫోన్లు, ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లు, 4కే టీవీలు, కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వంటి ప్రీమియం ఉత్పత్తులు భారీ తగ్గింపుతో అందుబాటులోకి రానున్నాయి.
ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్‌లో 2.2 లక్షల ఉద్యోగాలు సృష్టించింది. అంతేకాకుండా 400 కొత్త మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది.
బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్ ఈఎంఐలు, యూపీఐ డిస్కౌంట్లు వినియోగదారులను ఆకట్టుకునేలా సిద్ధం చేశారు. ఈసారి బిగ్ బిలియన్ డేస్ కేవలం షాపింగ్ కాకుండా, డిజిటల్ ఇండియాకు ఓ మైలురాయిగా నిలిచేలా ముస్తాబవుతోంది.