Saturday, May 2, 2026
HomeBig Storyనేపాల్, భారత్‌లో విలీనం కావాల్సిన దేశం.. ఇప్పుడు ఎందుకిలా..

నేపాల్, భారత్‌లో విలీనం కావాల్సిన దేశం.. ఇప్పుడు ఎందుకిలా..

nepal-india-merger-missed-opportunity-current-crisis
nepal-india-merger-missed-opportunity-current-crisis

న్యూస్ డెస్క్: నేపాల్ ఒకనాడు ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా నిలిచింది. 2006లో ప్రజాస్వామ్య ఉద్యమం వచ్చేవరకు అదే విధంగా కొనసాగింది. భారతదేశంలా ఆధ్యాత్మిక సంపద, సాంస్కృతిక విలువలు కలిగినా, రాజకీయ మార్పులు నేపాల్‌ భవిష్యత్తును దారుణంగా మార్చేశాయి.

భారత్‌తో నేపాల్‌కు శతాబ్దాల అనుబంధం ఉంది. స్వాతంత్ర్యం తరువాత నేపాల్ రాజు త్రిభువన్‌కి భారత్‌ సహాయం చేసి అధికారంలోకి తెచ్చింది.

అప్పుడు ఆయన భారతదేశంలో విలీనం కావాలన్న ప్రతిపాదన చేసినట్టు చరిత్ర చెబుతోంది. కానీ నెహ్రూ తిరస్కరించారు.

ఆ నిర్ణయం వల్ల భారత్‌-చైనా మధ్య సరిహద్దు సమస్యలు పెరిగాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

నేపాల్‌లో వనరులు విస్తారంగా ఉన్నా, పేదరికం తగ్గలేదు. రాజకీయ అస్థిరత, అవినీతి, పరిపాలన లోపాలు దేశాన్ని వెనక్కి నెట్టాయి.

పర్యాటక అవకాశాలు అపారంగా ఉన్నా, అభివృద్ధి జరగలేదు.

చరిత్ర చెబుతోంది.. నేపాల్‌ని అశోకుడు తన సామ్రాజ్యంలో కలిపి పాలించాడు. కానీ స్వాతంత్ర్యం తర్వాత సెక్యులరిజం కారణంగా భారత్ దూరంగా ఉంచింది.

అదే సమయంలో చైనా ప్రభావం పెరగడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది.

ప్రస్తుతం నేపాల్ చైనా, భారత్ మధ్య ఇరుక్కుపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకవేళ భారత్‌లో విలీనం జరిగి ఉంటే, రక్షణ భద్రత, ఆర్థిక అభివృద్ధి బలపడేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికీ నేపాల్‌ భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది. అంతర్గత, బాహ్య శత్రువుల ప్రభావం దానిని మరింత కష్టాల్లోకి నెడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular