Friday, April 17, 2026
HomeNationalనేపాల్ లో జెన్ Z ఉద్యమం.. తరాల గ్రూపుల వివరణ ఇదే

నేపాల్ లో జెన్ Z ఉద్యమం.. తరాల గ్రూపుల వివరణ ఇదే

న్యూస్ డెస్క్: నేపాల్ లో సోషల్ మీడియా నిషేధంపై యువత వీధుల్లోకి రావడం, భారీ ఆందోళనలు చేయడం సంచలనంగా మారింది. ఈ నిరసనల్లో ముఖ్యంగా జెనరేషన్ Z (Gen Z) అనే తరానికి చెందినవారే ముందుండడం విశేషం.

నిజానికి జెన్ Z అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని సూచిస్తుంది. వీరిని “డిజిటల్ నేటివ్స్” అని కూడా అంటారు. చిన్నప్పటి నుంచే ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియాతో పెరిగిన ఈ తరం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను తమ రోజువారీ జీవితంలో భాగంగా మార్చుకుంది. కాబట్టి నేపాల్ లో సోషల్ మీడియా నిషేధం వారికి పెద్ద షాక్ ఇచ్చింది.

ఈ నిరసనల వల్ల ప్రధాని కేపీ శర్మ ఓలి పదవికి రాజీనామా చేయడం, దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం వరకూ పరిణామాలు వెళ్లాయి. దీనివల్ల జెన్ Z తరం రాజకీయ, సామాజికంగా ఎంత ప్రభావం చూపగలదో మరోసారి స్పష్టమైంది.

ఇక జెన్ Z తో పాటు ఇతర తరాల గ్రూపులు కూడా ఉన్నాయి. 1901-1927 మధ్య జన్మించిన వారు “ది గ్రేటెస్ట్ జనరేషన్”, 1928-1945 మధ్య “సైలెంట్ జనరేషన్”, 1946-1964 మధ్య “బేబీ బూమర్స్” అని పిలుస్తారు. 1965-1980 మధ్య పుట్టినవారు “జెనరేషన్ X”, 1981-1996 మధ్యవారు “మిల్లీనియల్స్ లేదా జెన్ Y”.

ఇందులో మిల్లీనియల్స్, జెన్ Z తరాలు ఎక్కువగా టెక్నాలజీ ఆధారిత సమాజంలో పెరిగినవారు. వీరు ఆన్‌లైన్ వేదికల ద్వారా సమస్యలపై స్పందించడంలో, నిరసనలు చేయడంలో వేగంగా ఏకమవుతారని నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి నేపాల్ లో జెన్ Z ఉద్యమం ఒక తరపు శక్తిని చూపించింది. సోషల్ మీడియా నిషేధం ఒక నిర్ణయం మాత్రమే అయినా, యువత దానిని తమ స్వేచ్ఛలపై దాడిగా భావించడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular