
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో చిత్ర యూనిట్ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలకు ఎక్కువగా ఇంటర్వ్యూస్ ద్వారా ప్రమోషన్ చేశాడు. కానీ ఈసారి మాత్రం కూలీ సినిమాకు అనూహ్యంగా వినూత్న ప్రమోషన్ స్టైల్ ప్రయత్నించారు.
ఇప్పుడు అమెజాన్ డెలివరీ బాక్సెస్ పై కూలీ పోస్టర్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్‌లోకి ఈ బాక్సెస్ ఫోటోలు వస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వినూత్నంగా పోస్టర్ ప్రచారం చేయడంలో కూలీ చిత్ర యూనిట్ సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. మామూలుగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ద్వారా ప్రమోషన్ చేస్తారు కానీ డెలివరీ బాక్స్ ద్వారా ఇలా చేయడం చాలా రిఫ్రెష్‌గా అనిపించింది.
ఇది పూర్తిగా కొత్త ఐడియా అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా అమెజాన్ డెలివరీలు దేశవ్యాప్తంగా ఉంటాయి కనుక సినిమాకు మరింత పెద్ద ప్రచారం లభించనుంది. ఇలా ప్రచారం చేయడం ద్వారా యువతలో సినిమాపై క్యూరియాసిటీ పెరిగేలా ఉంది.
ఈ ప్రత్యేక ప్రమోషన్ ఐడియా యూనిక్‌గా ఉండటంతో మేకర్స్ కూడా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మరి కూలీ సినిమా ఆగస్ట్ 14న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పుడు ప్రమోషన్ స్టైల్ సినిమాకు ఇంకో అడ్వాంటేజ్ ఇచ్చినట్టే.