
పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న “కూలీ” మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్‌కు మేకర్స్ సిద్ధమయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రొమోషన్లతో హైప్ క్రియేట్ చేసింది.
ఇప్పటికే ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించిన మేకర్స్, ఈవెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రేపు ఆగస్ట్ 2న జవహర్ లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియం లో కూలీ ట్రైలర్‌ను గ్రాండ్ లాంచ్ చేయబోతున్నారు. అభిమానులకు ఇది పక్కా ఫీస్ట్‌గా మారనుంది.
స్టేడియంలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయడంపై ఫ్యాన్స్ లో ఎగ్జయిట్‌మెంట్ పెరిగింది. రజినీకాంత్, లోకేష్ కనగరాజ్, మేకర్స్ సహా ముఖ్య అతిథులు ఈ ఈవెంట్‌కు హాజరవుతారని సమాచారం.
ప్రేక్షకుల్లో ట్రైలర్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఎక్కువైంది. రేపు రిలీజ్ అయ్యే ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచుతుందో లేదో చూడాలి.
