Saturday, August 8, 2026
HomeSportsఓవల్ టెస్టులో భారత్ కు షాక్.. ఇంగ్లండ్ ఓపెనర్ల దూకుడు

ఓవల్ టెస్టులో భారత్ కు షాక్.. ఇంగ్లండ్ ఓపెనర్ల దూకుడు

oval-test-india-all-out-england-openers-attack

న్యూస్ డెస్క్: ఓవల్ టెస్టు రెండో రోజు భారత జట్టు ఆశించిన స్కోరు సాధించలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 224 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్ గస్ ఆట్కిన్సన్ 5 వికెట్లతో భారత్‌ను కట్టడి చేశాడు.

ఓవర్ నైట్ స్కోరు 204-6తో మొదలుపెట్టిన భారత్, కేవలం 20 పరుగుల వ్యవధిలోనే మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. కరుణ్ నాయర్ 57 పరుగులతో ఔట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 26, రవీంద్ర జడేజా 9 పరుగులు మాత్రమే చేశారు.

ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ మూడు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశారు. మొదటి ఇన్నింగ్స్ ముగిశాక, ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ భారత బౌలర్లపై దాడి చేశారు. 10 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 71 పరుగులు సాధించారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌లు ఎక్కువగా వైట్ బాల్ స్టైల్‌లో ఆడారు.

భారత్ పేస్ విభాగం ఈ మ్యాచ్‌లో చాలా స్లోగా కనిపించింది. బుమ్రా లేకపోవడంతో సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్రూక్, జాకోబ్ క్రీజులో ఉన్నారు.

ఇంగ్లండ్ భారత స్కోరుకు ఇంకా 44 పరుగులు వెనుకబడింది. భారత్ బౌలర్లకు త్వరగా బ్రేక్ తేవడం అత్యవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular