Friday, June 27, 2025
HomeMovie Newsఅఖండ 2 టీజర్.. బాలయ్య తాండవం మళ్ళీ మొదలైంది!

అఖండ 2 టీజర్.. బాలయ్య తాండవం మళ్ళీ మొదలైంది!

akhanda2-teaser-balakrishna-goosebumps-feast

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 టీజర్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. హిమాలయాల్లో త్రిశూలం చేత పట్టుకుని శత్రువులను ఛిద్రం చేస్తున్న అఘోర అవతారంలో బాలయ్య కనిపించే సన్నివేశాలు గూస్ బంప్స్ కలిగిస్తున్నాయి.

ఈ టీజర్‌కు బోయపాటి టేకింగ్ భారీ అట్రాక్షన్ అయితే, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూనకాల జల్లు. విజువల్స్, కట్, మ్యూజిక్ అన్నీ కలిపి ఒక పర్ఫెక్ట్ మాస్ ఫీస్ట్ ఇచ్చారు. 

అఖండ 2 టీజర్‌కి నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. “బాలయ్య ఈజ్ బ్యాక్”, “థమన్ మ్యూజిక్ మాస్” అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.

ఈసారి సినిమా పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండటంతో హైప్ మరింత పెరిగింది. సమ్యుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య పవర్ డబుల్‌గా ఉంటుందని టీజర్ చూపిస్తోంది.

టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.. బోయపాటి అండ్ థమన్ కాంబో మళ్లీ మేజిక్ చేస్తోంది. ఇక సినిమా కూడా అదే స్థాయిలో ఉంటే అఖండ 2 మరో బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం!

#Akhanda2 - Thaandavam  🔱 Teaser ( Telugu ) | NBK | Boyapati Srinu | Thaman S

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular