Sunday, January 18, 2026
HomeNationalకొత్త గ్రహాన్ని గుర్తించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. భూమి కన్నా భారీగా..

కొత్త గ్రహాన్ని గుర్తించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. భూమి కన్నా భారీగా..

james-webb-discovers-planet-twa7b

అంతరిక్ష పరిశోధనల్లో మరో ఘనవిజయం సాధిస్తూ నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ఈ టెలిస్కోప్ ఒక కొత్త గ్రహాన్ని ప్రత్యక్షంగా గుర్తించింది.

ఈ గ్రహానికి శాస్త్రవేత్తలు ‘టీడబ్ల్యూఏ 7బి’ అనే పేరు పెట్టారు. ఇది భూమి కన్నా దాదాపు 100 రెట్లు భారీగా ఉన్నా, గురుగ్రహంతో పోలిస్తే కేవలం 0.3 రెట్లు మాత్రమే బరువు కలిగిన గ్రహంగా గుర్తించారు. ఇది గతంలో కనుగొన్న ఇలాంటి గ్రహాల కన్నా తక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంది.

ఈ గ్రహం 111 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న టీడబ్ల్యూఏ 7 అనే యువ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ నక్షత్రం వయసు కేవలం 64 లక్షల సంవత్సరాలు మాత్రమే.

జేమ్స్ వెబ్‌లోని మిడ్-ఇన్‌ఫ్రారెడ్ ఇన్‌స్ట్రుమెంట్, కరోనాగ్రాఫ్ టెక్నాలజీ ఈ గ్రహాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి. ధూళివలయం మధ్య ఖాళీలో ఈ గ్రహాన్ని గుర్తించడం విశేషం.

ఈ గ్రహం గ్రహాల ఏర్పాటుపై కొత్త వెలుగులు వేసిందని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాల ఆవిష్కరణకు ఇది బాటలు వేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular