
తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తంలో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు హాలీవుడ్ వైపు అడుగులేస్తోంది.
తాజాగా ఆమె RIZANA – A Caged Bird అనే హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు చంద్రరత్నం దర్శకత్వం వహిస్తుండగా, వరలక్ష్మికి జోడిగా బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ నటిస్తున్నారు.
ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండటంతో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి శ్రీలంకలో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లను కలిపి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న వరలక్ష్మికి ఇప్పుడు హాలీవుడ్ ఛాన్స్ రావడం కెరీర్‌లో పెద్ద అడుగు.
గత ఏడాది హనుమాన్, రాయన్, మ్యాక్స్ లాంటి హిట్లలో మెరిసిన వరలక్ష్మి.. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న జన నాయగన్, శివంగి వంటి సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తోంది.
ఇప్పటికే నటిగా, న్యాయనిర్ణేతగా తాను చూపించిన టాలెంట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేజ్‌కి వెళ్లడంతో.. వరలక్ష్మికి హాలీవుడ్ ఎంతటి క్రేజ్ తెస్తుందో చూడాలి.