Monday, June 8, 2026
HomeMovie Newsక్రిస్మస్: 'అఖండ 2' కొత్త రిలీజ్ డేట్ అదేనా?

క్రిస్మస్: ‘అఖండ 2’ కొత్త రిలీజ్ డేట్ అదేనా?

akhanda-2-release-date-christmas-race-nitin-vishwak-sen-competition

నందమూరి బాలకృష్ణ అభిమానులు ప్రస్తుతం గందరగోళంలో ఉన్నారు. గురువారం రాత్రి జరగాల్సిన ప్రీమియర్స్ ఆగిపోవడం, ఆ వెంటనే సినిమా వాయిదా పడటం వారికి మింగుడుపడని విషయం. థియేటర్ల వరకు వచ్చి వెనుతిరిగిన ఫ్యాన్స్, అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

సినిమా ఆగిపోవడానికి కారణమైన ఆర్థిక న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకోవడంలో నిర్మాతలు తలమునకలై ఉన్నారు. ఈరోస్ సంస్థతో ఉన్న వివాదం కోర్టు పరిధిలో ఉండటంతో అది క్లియర్ అయితే తప్ప ముందడుగు పడదు.

అయితే పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, అఖండ 2: తాండవం చిత్రాన్ని డిసెంబర్ 25నవిడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ సెలవులు కలిసి వస్తాయి కాబట్టి, ఆ డేట్ అయితేనే సేఫ్ అని భావిస్తున్నారట.

సమస్య చిన్నదే అయితే వెంటనే రిలీజ్ చేయొచ్చు. కానీ పరిస్థితి చూస్తుంటే ప్రమోషన్స్‌కు మళ్లీ టైమ్ తీసుకుని, పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయాలని టీమ్ డిసైడ్ అయినట్లుంది. అప్పటికి అన్ని లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసుకుని, గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.

ఇప్పటికే డిసెంబర్ కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు బాలయ్య ఎంట్రీ ఇస్తే పోటీ రసవత్తరంగా మారుతుంది. మాస్ సినిమాకు పండగ సీజన్ తోడైతే కలెక్షన్స్ బాగుంటాయి.

కోర్టు తీర్పు ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్‌ను బట్టి ఈ డేట్ ఫైనల్ అవుతుంది. ఈ డేట్ ఫిక్స్ అయితే మాత్రం ఫ్యాన్స్ కు క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ ఒకేసారి వచ్చినట్లే భావించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular