Tuesday, May 12, 2026
HomeBig Storyభారత్ - రష్యా స్నేహం.. చరిత్ర చెప్పే సాక్ష్యం

భారత్ – రష్యా స్నేహం.. చరిత్ర చెప్పే సాక్ష్యం

india-russia-friendship-natural-ally-historic-ties-putin-visit

న్యూస్ డెస్క్: చరిత్రలో ఏ దేశాల మధ్య అయినా సహజ మిత్రులు అంటే భారత్ – రష్యా అని చెప్పొచ్చు. ఇరు దేశాల స్నేహాన్ని కాల పరీక్షలకు నిలిచినదిగా చెబుతుంటారు. ఒకప్పటి సోవియట్ యూనియన్ కానీ, ఇప్పటి రష్యా కానీ, భారత్‌తో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి.

చరిత్రలో ఎన్ని మార్పులు జరిగినా, ఎంద‌రు మ‌ధ్య‌లో వ‌చ్చి పుల్ల‌లు పెట్టాల‌ని చూసినా, భారత్-రష్యా బంధం చెక్కుచెదరకకుండా నిలిచింది. మహాకవి శ్రీశ్రీ కలం నుంచి వెలువడిన కవిత్వం బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ సినిమాలకు రష్యాలో విపరీతమైన ఆరాధన ఆ అనుబంధాన్ని చాటుతాయి.

1971 నాటి సాయం:

భారత్ – పాక్ మధ్య జరిగిన 1971 యుద్ధంలో పాక్‌కు అమెరికా చైనా మద్దతుగా నిలిచాయి. కానీ, అప్పటి సోవియట్ యూనియన్ మాత్రం భారత్‌కు అండ‌గా నిలిచింది. ఏకంగా బంగాళాఖాతంలో సబ్‌మెరైన్‌ను మోహ‌రించి భారత్‌ను గెలిపించింది.

2000 సంవత్సరం స‌మ‌యానికి కొంత స్తబ్ధ‌త నెల‌కొన్నా, మళ్లీ ఇప్పుడు భారత్-రష్యా సంబంధాలు గాడిన‌ప‌డ్డాయి. డొనాల్డ్ ట్రంప్ పుణ్య‌మా అని భారత్ – రష్యా మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నాయి.

పుతిన్ హయాంలోనూ ఈ స్నేహం కొనసాగుతోంది. 25 ఏళ్లలో పుతిన్ భారత్‌కు ఎన్న‌డూ వ్య‌తిరేకంగా లేరు. 2012లో అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్, పుతిన్‌ను భారత్‌కు నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular