Sunday, May 24, 2026
HomeInternationalట్రంప్ షాకింగ్ డెసిషన్: హెచ్-1బీ వీసాకు లింక్డ్‌ఇన్, రెజ్యూమే

ట్రంప్ షాకింగ్ డెసిషన్: హెచ్-1బీ వీసాకు లింక్డ్‌ఇన్, రెజ్యూమే

trump-h1b-visa-new-social-media-vetting-linkedin-resumes-mandatory

అమెరికా: అధ్యక్షుడిగా ట్రంప్ 2.0 వెర్షన్ వలస విధానాలలో భయంకరంగా ఉంటోంది. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక హెచ్-1బీ వీసాల చుట్టూ రోజుకో నిబంధనను కఠినతరం చేస్తున్నారు.

హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డ్‌ఇన్ పేజీలు, రెజ్యూమేలు విధిగా రివ్యూ చేయాలని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ దౌత్యవేత్తలకు హుకుం జారీ చేసింది. ఈ మేరకు డిసెంబర్ 2న అన్ని అమెరికా ఎంబసీ కార్యాలయాలకు వెట్టింగ్ (క్షుణ్ణ పరిశీలన) ఆదేశాలు జారీ అయ్యాయి.

హెచ్-1బీతో పాటు హెచ్-4 వీసాదారుల లింక్డ్‌ఇన్ ప్రొఫైల్, రెజ్యూమేలు చెక్ చేయాలి. దరఖాస్తుదారులు అసత్య ప్రచారం, కంటెంట్ కంట్రోల్, ఆన్‌లైన్ సేఫ్టీ విభాగాల్లో పనిచేశారో లేదో తెలుసుకోవాలి.

వీసాలకు దరఖాస్తు చేసుకున్నవారు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్‌లను పబ్లిక్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు.

యుఎస్ వీసా పొందడం ఎట్టిపరిస్థితుల్లోనూ హక్కు కాదని అమెరికా అంటోంది. దేశభద్రతే తమకు ముఖ్యం అని, అందుకే దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందితేనే వీసా మంజూరు చేస్తామని వెల్లడించారు. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారుల్లో చైనా, ఇండియన్లే అధికసంఖ్యలో ఉంటారు.

అమెరికా యూరప్ దేశాలు ఇలా వలస నిబంధనలను కఠినతరం చేస్తే అది వారి దేశానికే నష్టమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. టాలెంట్ ఉన్నవారిని అడ్డుకుంటే అది వారి దేశ ప్రయోజనాలకే గొడ్డలిపెట్టని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular