
న్యూస్ డెస్క్: తిరుమలలో భద్రతపై సందిగ్ధత నెలకొంటోంది. టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఉగ్రదాడి జరుగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మూడంచెల భద్రతను శ్రీవారి ఆలయం చుట్టూ ఏర్పాటు చేయడంలో టీటీడీ చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని భానుప్రకాశ్ విమర్శించారు. భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను రాజకీయంగా వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. మఠాలలో భక్తుల ఆధార్ డేటా తీసుకోవడాన్ని తప్పుగా చిత్రీకరించొద్దని హెచ్చరించారు.
మఠాలు, పీఠాధిపతులకు టీటీడీ గౌరవంతో ఉందని, భక్తుల రక్షణ కోసం నిబంధనలు పాటించడం తప్పు కాదని చెప్పారు. సీసీ కెమెరాలు పెట్టాలని సూచించడం కూడా భద్రత కోసం తీసుకున్న అవసరమైన చర్యలలో భాగమేనన్నారు.
తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని ఆరోపిస్తూ, వైసీపీ నేతలపై భానుప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.