
కథ:
ధనుష్ – నాగార్జున కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల రూపొందించిన “కుబేర” సినిమా ఓ నిజాయితీగల సీబీఐ ఆఫీసర్ దీపక్ (నాగార్జున) చుట్టూ తిరుగుతుంది. తప్పుడు కేసుల్లో జైలు పాలవుతాడు. మరోవైపు, పారిశ్రామిక దిగ్గజం నీరజ్ (జిమ్ సర్బ్) తన వ్యాపార ప్రయోజనాల కోసం దేశానికి చెందిన భారీ చమురు నిల్వలపై కన్నేస్తాడు.
దీన్ని అడ్డుకోవడానికి దీపక్ ప్లాన్ చేస్తాడు. దీనికోసం నలుగురు బినామీలను ఎంపిక చేస్తాడు. వారిలో ఒకడు దేవ్ (ధనుష్) అనే బెగ్గర్. దేవ్ పాత్రకు కథలో కీలక టర్నింగ్ పాయింట్ ఉంది. గతంలో దీపక్ – దేవ్ మధ్య ఉన్న బంధం, మిగతా పరిణామాలు ఈ కథను ముందుకు తీసుకెళ్తాయి.
విశ్లేషణ:
శేఖర్ కమ్ముల ఈసారి తన మార్క్ భావోద్వేగంతో కూడిన కథను తీసుకున్నా.. అందులో నయవంచన, లావాదేవీలు, సామాజిక సందేశాన్ని జోడించారు. నాగార్జున పాత్ర బలంగా కనిపించింది. ధనుష్ మరోసారి నటనలో తన స్థాయిని నిరూపించుకున్నాడు.
కథ రాస్తున్న తరహా, సీన్ పుల్లింగ్స్ ఆకట్టుకున్నా, కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా అనిపించింది. రష్మిక తక్కువ స్క్రీన్ టైమ్‌లోనే మెప్పించింది. జిమ్ సర్బ్ విలన్‌గా బాగా సెట్ అయ్యాడు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. కానీ స్క్రీన్‌ప్లే మరింత గట్టిగా ఉంటే బెటర్ అనిపిస్తుంది. సోషియల్ మెసేజ్ ఉన్న కథను ఎమోషనల్ యాంగిల్‌తో చెప్పే ప్రయత్నం ఆకట్టుకుంది.
ప్లస్ పాయింట్స్:
ధనుష్, నాగార్జున నటన
శేఖర్ కమ్ముల భావోద్వేగం నిండిన కథ
టెక్నికల్‌గా రిచ్ మేకింగ్
డిఫరెంట్ కాన్సెప్ట్ – బినామీ డ్రామా
డీఎస్పీ సంగీతం, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
నాగ్ – విలన్ ట్రాక్ బలహీనంగా ఉండటం
సెకండ్ హాఫ్ స్క్రీన్‌ప్లే
రేటింగ్: 3.25/5
kubera movie review, dhanush nagarjuna combo, shekar kammula direction, telugu movie analysis, emotional thriller drama,