
న్యూస్ డెస్క్: వివాదాస్పద ఆధ్యాత్మిక నేత నిత్యానంద ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే ప్రశ్నకు తాజాగా కోర్టులో సమాధానం లభించింది. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో జరిగిన విచారణ సందర్భంగా ఆయన శిష్యురాలు అర్చన చేసిన ప్రకటనతో ఈ విషయం బయటపడింది.
తన గురువు నిత్యానంద ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే ప్రత్యేక దేశంలో నివసిస్తున్నారని అర్చన కోర్టుకు తెలియజేశారు. మదురై ఆధీన మఠం సంబంధిత వివాదంలో జరిగిన విచారణలో ఈ వివరణ వినిపించారు.
ఇందుకు ముందు కోర్టు “నిత్యానంద ఎక్కడ ఉన్నారు?”, “కైలాస దేశం వాస్తవమేనా?” వంటి ప్రశ్నలు సంధించగా, ఇప్పుడు ఆయన ఆచూకీపై స్పష్టత వచ్చింది. దీంతో నిత్యానంద తిరిగి వార్తల్లోకి వచ్చారు.
కాగా, మదురై మఠంలోకి ప్రవేశించరాదని వచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిత్యానంద అప్పీల్ దాఖలు చేయడం తెలిసిందే. ఇప్పుడు ఆయన తరఫున కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు కోర్టు అనుమతిని మంజూరు చేసింది.
ఈ పరిణామాలతో నిత్యానంద స్థానం, కైలాస దేశ వాస్తవతపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఇదే అంశంపై తదుపరి విచారణ త్వరలోనే జరగనుంది.