
స్పోర్ట్స్ డెస్క్: భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చే ఆశతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. 37 ఏళ్ల వయసులోనూ దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తూ ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.
2023లో జరిగిన టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న ఉమేశ్, అప్పట్లో 131 పరుగులకే రెండు వికెట్లు మాత్రమే తీశారు. ఆ తర్వాత గాయాలు, ఫామ్ కోల్పోవడం, యువ బౌలర్ల రాకతో జట్టులో స్థానాన్ని కోల్పోయారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమేశ్, “తిరిగి జట్టులోకి రావాలన్నదే నా లక్ష్యం. అయితే నన్ను నేను ఎంపిక చేసుకోలేను కదా?” అంటూ తన భావాలను వెల్లడించారు. దేశవాళీ మ్యాచ్‌లు ఆడి పర్ఫామెన్స్ చూపిస్తానని చెప్పారు.
తాను చిన్నప్పటి నుంచే ఫాస్ట్ బౌలర్‌గానే ఎదిగానని, ప్రత్యేక శిక్షణ లేకుండానే పైకి వచ్చానని చెప్పారు. ఒక బొగ్గుగని కార్మికుడి కుమారుడిగా భారత్ తరఫున ఆడటం గొప్ప ఘనతగా భావిస్తున్నానన్నారు.
అడుగడుగునా పోరాడే తన లక్ష్యసాధనకు ఇంకా తాను సిద్ధమేనని ఉమేశ్ యాదవ్ స్పష్టంచేశారు.