
టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర సినిమా జూన్ 20న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది.
ఇటీవల సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. మార్పులు చేసిన తర్వాత సినిమా రన్ టైమ్ దాదాపు 3 గంటలుగా ఉంది. ఇప్పుడు రిలీజ్ ఏర్పాట్లతో పాటు, టికెట్ రేట్ల పెంపుపై కూడా కీలక సమాచారం బయటకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కుబేరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. జీఎస్టీ అదనంగా ఉండే విధంగా, రూ.75 వరకు ధర పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
దీంతో మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.265.50 వరకు, సింగిల్ స్క్రీన్‌లలో రూ.236 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ రేట్లు కేవలం విడుదలైన 10 రోజుల పాటు మాత్రమే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణలో టికెట్ ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రీబుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కుబేర కంటెంట్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న మేకర్స్, మంచి హిట్‌కు సిద్ధమవుతున్నారు.