Monday, January 19, 2026
HomeMovie Newsస్పిరిట్’లో ఉపేంద్ర ఎంట్రీ.. సందీప్ వంగా క్యాస్టింగ్ జోరుగా!

స్పిరిట్’లో ఉపేంద్ర ఎంట్రీ.. సందీప్ వంగా క్యాస్టింగ్ జోరుగా!

spirit-upendra-role-reveal

యానిమల్ సినిమాతో నేషనల్ లెవల్‌లో బ్లాక్‌బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా, ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వగా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే త్రిప్తీ డిమ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేసిన వంగా, ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమాయేను ఎంచుకున్నారు. యానిమల్‌లో మెషిన్ గన్ అమ్మే ఫ్రెడ్డి పాత్రతో ఆకట్టుకున్న ఆయన, తాజాగా సందీప్ హైదరాబాద్ కార్యాలయంలో కనిపించారు.

సందీప్, ప్రణయ్ బ్రదర్స్‌ను కలిసిన ఉపేంద్ర.. భద్రకాళి పిక్చర్స్ ఆఫీస్‌లో దిగిన ఫోటోను షేర్ చేయడంతో స్పిరిట్‌లో ఆయన పాత్రపై అంచనాలు పెరిగిపోయాయి. ఆయన పోస్ట్ వైరల్‌గా మారింది.

స్పిరిట్‌ సినిమాలో ఉపేంద్ర పాత్ర కీలకమవుతుందని టాక్. కామెడీ, మాస్ మిక్స్‌ ఉన్న పాత్రలో ఆయనను చూపించనున్నారని సమాచారం. ఇక చిరంజీవి ఆరాధన పోస్టర్ దగ్గర ఆయన దిగిన ఫోటో కూడా హైలైట్‌గా మారింది.

టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్, సందీప్ వంగా కాంబినేషన్‌కు భారీ హైప్ నెలకొనగా.. ఉపేంద్ర ఎంట్రీ మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular