
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మెగా 157’ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి ఊహించని వేగంతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేయగా, మూడో షెడ్యూల్‌కు రంగం సిద్ధం చేశారు. చిరు, నయనతార, క్యాథరిన్ త్రెస్సా, బుల్లిరాజు పాత్రలపై కీలక సన్నివేశాలు పూర్తి చేసి, ఇప్పుడు అసలైన హైలైట్ ఎపిసోడ్లకు గ్రౌండ్ వేశాడు.
వెంకటేష్ కూడా ఉన్న కీలక ఎపిసోడ్లను వచ్చే నెల నుంచి మొదలు పెట్టాలని అనుకుంటున్నట్టు సమాచారం. డేట్లు ఫిక్స్ అయినప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అనిల్ తీసేవి కమర్షియల్ సినిమాలైనా.. మేకింగ్ క్వాలిటీ, వేగం తగ్గకుండా సాగించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
నేడు ప్యాన్ ఇండియా మోజులో Directors సంవత్సరాల తరబడి సినిమాలు ఆలస్యం చేస్తున్న సమయంలో అనిల్ మాత్రం వేగంగా పనులు పూర్తిచేస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సొంత స్పీడ్‌తో ఆయనకు ప్రత్యేక స్థానం లభిస్తోంది.
ఇటీవల పలు నూతన దర్శకులు ఒక్క హిట్ కొట్టి ఆ తర్వాత సినిమాలు లేట్ చేయడం చూస్తున్న తరుణంలో అనిల్ పద్ధతి ఒక లెసన్ లా నిలుస్తోంది. మొదటి రోజు నుంచే ప్రణాళికతో పనులు చేస్తున్న అనిల్ పాజిటివ్ బజ్‌ను పెంచుతున్నాడు.
2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తానన్న అనిల్ తన మాట నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు. ప్రతి అప్డేట్‌తో మెగా ఫ్యాన్స్‌కు ఎనర్జీ ఇస్తున్నాడు.
mega157, anil ravipudi, chiranjeevi new movie, tollywood direction, mega fans buzz,
